![]() |
![]() |
.webp)
ఫేక్ న్యూస్ అనేది డిజిటల్ మీడియాలో కామన్ గా మారింది. దీనివల్ల కొంతమంది మానసికంగా బాధపడుతున్నారు. వారికి సంబంధం లేని విషయాల్లో చేర్చి వ్యూస్ తెచ్చుకుంటున్నారు. ఇదే విషయాన్ని బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ తెలియజేసింది.
సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ క్రమంగా ఫేమస్ అయ్యింది నటి హిమజ. నటిగా మంచి పేరు తెచ్చుకొని కొన్ని సీరియళ్లలోను నటించింది. వీటితో పాటు పలు టీవీ షోలు కూడా చేసింది హిమజ. అయితే, బిగ్‍బాస్ ద్వారా ఆమె చాలా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కూడా చాలా చిత్రాల్లో నటించింది. హిమజ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి సినిమాలకి మాటలు, పాటలు రాసేవాడు. అలా తను మాటలు, పాటలు రాసిన 'సర్వాంతర్యామి' అనే టెలీఫిల్మ్ లో తొలిసారి నటించింది హిమజ. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడపాదడపా సీరియల్స్ లో నటించిన హిమజ.. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నా నటించిన 'శివమ్' చిత్రంలో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా వెండితెరకు కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామ రావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలలో చేసింది.
అయితే ఇప్పుడు సినిమాలలో బిజీగా ఉంటోంది హిమజ. తనకి ఖాళీ సమయం దొరికినప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, పోస్ట్ లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. నిన్న మొన్నటిదాకా విదేశాలలో ట్రావెల్ చేసి వచ్చిన హిమజ. అయితే తాజాగా ఇన్ స్ట్రాగ్రామ్ లో తనపై వస్తున్న రూమర్స్ గురించి హిమజ స్పందించింది. తన ఫ్రెండ్స్ కాల్ చేసి నీ గురించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందని చెప్పారంట. అదేంటంటే గత కొన్ని రోజులుగా రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్ గురించి వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అయితే అందులో బిగ్ బాస్ నటులు కొందరు ఉన్నారంటూ హిమజ ఫోటోని పెట్టి యూట్యూబ్ లలో వీడియోలు చేస్తున్నారంట. ఇలా ఎన్నోసార్లు చెప్పాను. బిగ్ బాస్ షో ముగిసాక నేను నాతోటి కంటెస్టెంట్స్ కొందరం కలిసి ఓ ఈవెంట్ కి వెళ్ళాం. అంతమాత్రాన మాకు అతనికి రిలేషన్ ఉన్నట్టేనా.. నేను అతడిని బ్రదర్ లా భావించి రాఖీ కూడా కట్టాను. ఇలాంటివి ఎవరు నమ్మరు. కానీ వందలో ఇరవై శాతం మంది నమ్ముతారు. వారివల్ల మాకు ఇబ్బంది అని హిమజ చెప్పుకొచ్చింది. ఇలాంటివాటిని దయచేసి ఎంకరేజ్ చేయకండి అంటూ హిమజ తన ఇన్ స్టాగ్రామ్ లోని వీడియోలో చెప్పింది. కాగా ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
![]() |
![]() |